జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపీ గడ్డం వంశీ కృష్ణను ఆహ్వానించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు కావాలని ఉద్దేశపూర్వకంగా అవమానించారని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, మలమానాడు జాతీయ అధ్యక్షుల ఆదేశాలతో నల్గొండ మీడియా సమావేశంలో మాట్లాడారు.