ఆత్మహత్య అనేది తుది పరిష్కారం కాదని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని 12వ బెటాలియన్ కమాండెంట్ కె. వీరయ్య అన్నారు. నల్గొండ జిల్లా అన్నేపర్తిలోని 12వ బెటాలియన్ లో శనివారం తెలంగాణ పోలీస్ శాఖ, ఆత్మహత్యల నివారణ కమిటీ సంయుక్తంగా నిర్వహించిన ఆత్మహత్యల నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆలోచిస్తే, మానవ జీవితాలను రక్షించగలగడం సాధ్యమే, సమస్య వచ్చినప్పుడు బాధపడడం కన్నా సమస్యకి పరిష్కారం ఆలోచించాలన్నారు.