Apr 24, 2025, 07:04 IST/
చిన్న పైరవీలు చేసిన కఠిన చర్యలు తప్పవు: డిప్యూటీ సీఎం
Apr 24, 2025, 07:04 IST
AP: చాలా ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాలను ప్రారంభించారు. మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలని, పల్లె నిధులు వాటికే ఉపయోగించాలని పేర్కొన్నారు. అధికారుల కృషితో గ్రామీణ అభివృద్ధి వేగవంతమైందని, బిల్లులు రాకపోయినా పనులు చేసిన గుత్తేదారులకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న పైరవీలు చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.