యాదగిరిగుట్ట పేలుడు ఘటనలో చనిపోయిన మృతుడి కుటుంబాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పరామర్శించారు. భువనగిరి ప్రభుత్వాసుపత్రికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. యాదగిరిగుట్ట(M) పెద్దకందుకూరులో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమలో పేలుడు దాటికి ఒకరు మృతి చెందారు. 43 మంది కార్మికులకు భువనగిరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.