భారత రాష్ట్రపతికి ఎయిడ్‌-డె-క్యాంప్‌గా యశస్వీ సోలంకి

64చూసినవారు
భారత రాష్ట్రపతికి ఎయిడ్‌-డె-క్యాంప్‌గా యశస్వీ సోలంకి
భారత నౌకాదళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ యశస్వీ సోలంకి, రాష్ట్రపతికి ఎయిడ్‌-డె-క్యాంప్‌ (ADC)గా నియమితులయ్యారు. తొలి మహిళా నేవల్ ఆఫీసర్‌గా యశస్వీ సోలంకి గుర్తింపు పొందారు. భారత రాష్ట్రపతికి సేవలందిస్తూ, ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేపట్టడం, అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు తదితర బాధ్యతలు సోలంకీ నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రపతికి మొత్తం ఐదుగురు ఏడీసీలు నియమితులవుతారు. వీరిలో ఆర్మీ నుంచి ముగ్గురు, ఎయిర్‌ఫోర్స్‌,నేవీ నుంచి చెరో ఒక్కరిని ఎంపిక చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్