ఏపీలో వైసీపీ నేతలు రూ.20 వేల కోట్ల ఖనిజ సంపదను దోపిడీ చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తామన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ‘‘రాష్ట్రంలో మైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరాం. ఐఐటీ, ఎన్‌ఐటీలో మైనింగ్, మినరల్ కోర్సులు పెట్టాలని.. గ్రానైట్ ప్రమోషన్ బోర్డు ఏర్పాటు చేయాలన్నాం" అని రవీంద్ర తెలిపారు.