విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వైఎస్సార్ సీపీ తలపెట్టిన ‘ఫీజు పోరు’ నిరసన కార్యక్రమం వాయిదా పడింది. ఫిబ్రవరి 5న జరగాల్సిన కార్యక్రమాన్ని మార్చి 12కి వాయిదా వేసినట్టు పార్టీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా వేయాలని నిర్ణయించింది.