AP: గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ రాకేష్ గాంధీని పోలీసులు అరెస్ట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలపై రాకేష్ గాంధీ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో శనివారం పోలీసులు రాకేష్ గాంధీని అదుపులోకి తీసుకుని చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.