రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

79చూసినవారు
రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తెలంగాణలో ఆదివారం భారీ వర్షాలు కురువనున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్