బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోందని.. దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. తూర్పు, ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.