ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారుతున్న వేళ, యెమెన్ సాయుధ దళాలు యుద్ధంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, ఇరాన్ బలగాలతో కలిసి తమ దళాలు రెండు హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేశాయని యెమెన్ మిలిటరీ ప్రకటించింది. ఈ దాడి గత 24 గంటల్లో జరిగిందని, పూర్తి విజయవంతమైందని వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ చర్యలు అన్యాయమైనవని, అణచివేతకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని యెమెన్ స్పష్టం చేసింది.