తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వయోభార సమస్యతో బాధపడుతున్న ఆమె.. ఆదివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణవేణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి. 1936 డిసెంబర్ 24న జన్మించారు. 1936లో ‘అనసూయ’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేశారు. ‘మనదేశం’ సినిమాతో సీనియర్ ఎన్టీఆర్‌ను కృష్ణవేణి సినిమా రంగానికి పరిచయం చేశారు.