బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను రక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో కీలక చర్యకు సిద్ధమయ్యింది. నామినీ ఫారాల్లో పేర్లతో పాటు వారి ఇమెయిల్, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలను జోడించాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై బ్యాంకులు, ప్రభుత్వ అభిప్రాయాలను కోరుతుంది. నామినీలతో సంప్రదింపులకు వీలుగా వారి సమాచారం పూర్తి స్థాయిలో ఉండాలన్నదే ఆర్బీఐ ఉద్దేశ్యం.