రైల్లో గంజాయి తరలిస్తన్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన 31 ఏళ్ల బెంజమిన్ గమాంగోను సికింద్రాబాద్ జీఆర్సీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో సికింద్రాబాద్‌కు చేరుకున్న అతని బ్యాగ్‌ను తనిఖీ చేసిన పోలీసులకు 4.5 కిలోల గంజాయి లభించింది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.