TG: అటవీశాఖ అధికారులు ఇల్లును కూల్చివేయడంతో యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువు తండా గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బానోత్ సంతోష్ ఇటీవల ఇల్లు కట్టుకున్నాడు. దాన్ని అటవీశాఖ అధికారులు కూల్చివేయడంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.