ఆన్‌లైన్ లో ఆటలకు అలవాటు పడి డబ్బులు కోల్పోవడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నె పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సిరికొండ నిఖిల్ రావు(22) హైదరాబాద్ లో అగ్రికల్చర్ బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన అతను సోమవారం గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.