అనారోగ్యంతో బాధపడుతూ యువకుడి ఆత్మహత్య

58చూసినవారు
అనారోగ్యంతో బాధపడుతూ యువకుడి ఆత్మహత్య
TG: అనారో గ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల(D) నెన్నెల(M) జెండా వెంకటాపూర్‌‌కు చెందిన సత్తయ్య, అమృత దంపతుల కుమారుడు అనిల్‌ (24) పలు వ్యాధులతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ‘అమ్మా.. నన్ను క్షమించండి.. నాకు ఆరోగ్యం బాగుండడంలేదు. బాధ భరించలేక చనిపోతున్నా. అన్నయ్య సారీ రా.. అమ్మా నాన్నను కష్టపెట్టకు' అని సూసైడ్ నోట్‌ రాసి ఉంచాడు.

సంబంధిత పోస్ట్