యూపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. లౌన్ కొత్వాలి ప్రాంతంలోని జోషియానా మొహల్లాలో చెరువు వద్దకు స్నానానికి వెళ్లిన యువకుడు.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. మధ్యప్రదేశ్ నుంచి యూపీకి తన బంధువుల ఇంటికి వచ్చాడని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.