రాజస్థాన్‌లోని కోటాలో స్విమ్మింగ్ పూల్‌లో స్టంట్స్ చేస్తూ శనివారం ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కోటాలోని ఘంటాఘర్‌కు చెందిన ముబారిక్ తన స్నేహితులతో కలిసి నాంతా ప్రాంతంలోని ఒక ఫామ్ హౌస్‌కు పిక్నిక్ కోసం వెళ్లాడు. స్విమ్మింగ్ పూల్‌లో దూకి స్టంట్స్ చేశాడు. కాసేపటికి స్విమ్మింగ్ పూల్‌లో అపస్మారక స్థితిలో కనిపించాడు. ఫ్రెండ్స్ ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.