యూపీలోని ఉన్నావ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అక్కడి నవాబ్‌గంజ్‌లోని ఒక మద్యం దుకాణంలోకి ఓ యువకుడు వెళ్లాడు. అయితే అతడు ఉన్నటుండి కుప్పకూలి మరణించాడు. దీంతో అతడిని గమనించిన మద్యం దుకాణ కార్మికులు మృతదేహాన్ని బయటకు విసిరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ ఘటన జూలై 2న జరిగినట్లు తెలుస్తోంది. కాగా పోస్ట్‌మార్టం రిపోర్టులో అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు తేలింది.