మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మాఫియా ముఠా సభ్యుడు, తమ నాయకుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె బైక్ ప్రమాదంలో మృతిచెందింది. అయితే ప్రియుడే ఆమెను చంపాడని ముఠా సభ్యులు అనుమానిస్తున్నారు. దీంతో 40 మంది గ్యాంగ్‌స్టర్లు అతడి కోసం వెతుకుతున్నారు. ప్రాణభయంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.