ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో మందుబాబులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు హైవేపై దూసుకెళ్తున్న కారుతో విన్యాసాలు చేశారు. వేగంగా వెళ్తున్న కారు విండో నుంచి బయటకు వచ్చి కేరింతలు కొట్టారు. తల బయట పెట్టి డ్యాన్స్ చేస్తూ వీరంగం సృష్టించారు. ఈ ఘటనను బాటసారులు వీడియో తీసి నెట్టింట పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. పోలీసులు కారు నెంబర్ ను గుర్తించి యువకుల కోసం గాలిస్తున్నారు.