సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు యువకులు చెరువులో స్నానం చేసేందుకు వెళ్తారు. కొద్ది సేపు స్విమ్మింగ్ చేసిన తర్వాత గట్టుకు వచ్చి సబ్బు రాసుకుంటారు. వారిలో ఓ వ్యక్తి సబ్బును ముఖానికి రాసుకొని నీటిలో దూకేందుకు ప్రయత్నిస్తాడు. చెరువు నీటిలోకి దూకాల్సిన యువకుడు.. కళ్ల కనపడకపోవడంతో చెరువు గట్టుకు ఇటు వైపు నేలపై దూకేస్తాడు. చివరకు అతడి స్నేహితుడు అతడి వద్దకు వచ్చి పట్టుకుని లాగి నీటిలో విసిరేస్తాడు.