డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి (వీడియో)

59చూసినవారు
స్టేజీపై డాన్స్ చేస్తూ ఓ యువతి ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఇండోర్ కు చెందిన ఓ యువతి విదిషలో జరిగిన తన సోదరి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె డాన్స్ చేస్తూ ఆగిపోయి ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్