హైదరాబాద్ లోని కొండాపూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి గణేష్ మండపం వద్ద మద్యం, గంజాయి సేవించి మత్తులో కత్తులు, కర్రలతో వీరంగం సృష్టించారు. కొండాపూర్ లోని హిందూ జై గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులపై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అవ్వడంతో స్థానికులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. నిందితులను బంజారాహిల్స్ కు చెందిన చందు ఫైల్వాన్,రణదీప్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.