తెలంగాణలోని వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లైశెట్టి రాజు అనే యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బు పెట్టి లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటుతున్నాయి. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.