యూపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. అలీగఢ్‌లోని స్వర్ణ్ జయంతి నగర్‌కు చెందిన ఓ యువకుడు డిప్రెషన్ కారణంతో.. తన తండ్రి లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.