టిప్పర్ ఢీకొని యువకుడు మృతి

59చూసినవారు
టిప్పర్ ఢీకొని యువకుడు మృతి
TG: టిప్పర్ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బీరంగుడా మల్లికార్జున నగర్‌కు చెందిన తరుణ్ (28) స్కూటీ పై కొల్లూర్‌కు వెళ్తుండగా, వెనక నుంచి టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో తరుణ్‌ను బీరంగుడా పనేషియా హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్