సభ స్టేజిని ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యాదాద్రి జిల్లా అడ్డగూడూర్ మండలం మానాయకుంట గ్రామ బ్రిడ్జిపై మూసీ పరివాహక రైతుల ఆత్మీయ సమ్మేళనం అంటూ అధికార పార్టీ నేతలు స్టేజిని ఏర్పాటు వేశారు. బ్రిడ్జిపై స్టేజి వేయగా.. రోడ్డు ఉందని ఎప్పటిలాగే బైక్‌పై వెళ్లిన చరణ్(17) స్టేజిని ఢీకొని మృతి చెందాడు. చరణ్‌ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి, హుటాహుటిన నాయకులు స్టేజిని తొలగించినట్లు సమాచారం.