'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. "మహిళలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుంది. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి.. అనేక పథకాల ద్వారా వారికి భరోసా కల్పించాం. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. నా భవిష్యత్ రాజకీయ ప్రస్థానం కూడా మహిళాభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సాగుతుంది." అని జగన్ ట్వీట్ చేశారు.