ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువరాజ్‌

63చూసినవారు
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువరాజ్‌
మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాను బుక్‌ చేసుకున్న ఫ్లాట్‌ను డెలివరీ చేయడంలో జాప్యం జరుగుతుందని.. తనకు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిని నియమించాలని కోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. మాజీ క్రికెటర్ 2021లో ఢిల్లీలోని హౌస్‌ఖాన్‌ సంస్థతో ఒక ఫ్లాట్‌ బుక్‌ చేశారు. ఆ సమయంలో ఫ్లాట్‌ ధర రూ.14.10కోట్లుగా పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్