సామాజిక మాధ్యమాల్లో ఏకఛత్రాధిపత్యం కోసం మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లను కొనుగోలు చేసిందని వచ్చిన ఆరోపణలపై.. యాంటీ ట్రస్ట్ ట్రయల్‌కు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో హాజరయ్యారు. యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఈ రెండు సంస్థలను విక్రయించాలంటూ ఒత్తిడి తెస్తోంది. అయితే, ట్రంప్ అధికారంలోకి వస్తే విచారణ నిలిచిపోతుందన్న జుకర్‌బర్గ్ ఆశలు, తాజా పరిణామాలతో ఆవిరైపోయాయి.