రిలయన్స్ డైరెక్టర్ల బోర్డులోకి అంబానీ వారసులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త శకానికి నాంది పలికింది. సంస్థ అధినేత ముకేశ్ అంబానీ తన వారసులు.. అనంత్ అంబానీ, ఆకాశ్ అంబానీ, ఈశా అంబానీలను డైరెక్టర్ బోర్డులోకి చేర్చుకుంది. ఈ విషయాన్ని రిలయన్స్ శుక్రవారం వెల్లడించింది. గత నెల జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎంలో తన పిల్లలను బోర్డ్ డైరెక్టర్లుగా నియమించడానికి వాటాదారుల అనుమతి కోరారు.