

VIDEO: భారీగా మంటలు.. ప్రాణాలు లెక్కచేయకుండా కుందేలును కాపాడాడు
అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఏర్పడిన కార్చిచ్చు భారీ నష్టాన్ని మిగిల్చింది. లాస్ ఎంజెల్స్, కాలిఫోర్నియా నగరాల్లో ఏకంగా 10 మంది చనిపోగా, 1 లక్షా 30 వేల మందిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అలాగే కొన్నిచోట్ల మూగజీవాలను కాపాడేందుకు కొందరు ప్రాణాలను సైతం లెక్కచేయట్లేదు. ఓ యువకుడు భారీ మంటల్లో చిక్కుకున్న కుందేలు పిల్లను బయటకు తీసుకొచ్చి కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.