
వీసా సేవల పునరుద్ధరణపై కెనడాకు కండీషన్
భారత ప్రభుత్వం కెనడియన్లకు వీసా సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. వీసా సర్వీసుల్ని పునరుద్ధరించడం కోసం తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కెనడా ఓ కండీషన్‌ను అంగీకరించాల్సి ఉంటుందన్నారు. వియన్నా కన్వెన్షన్ ప్రకారం.. కెనడాలోని భారత దౌత్యవేత్తలకు అక్కడి ప్రభుత్వం భద్రత కల్పిస్తే, వీసా సర్వీసుల్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు.