రూ. 300 కోసం ఘర్షణ.. కర్రతో దాడి చేయడంతో వ్యక్తి మృతి (వీడియో)
AP: కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బపామర్రు మండలం చాట్లవానిపురం గ్రామానికి చెందిన సతీష్, వెంకటేశ్వరరావులు రూ. 300 కోసం గోడవపడ్డారు. ఈ క్రమంలో సతీష్‌పై వెంకటేశ్వరరావు కర్రతో దాడి చేశారు. వెంటనే సతీష్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.