
మాదాపూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మాదాపూర్ లో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్స్ రోడ్డులో వేగంగా వచ్చిన బులెట్ బైక్ అదుపుతప్పి డివైడర్ ను డీకొట్టడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా.. మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతులు బొరబండకు చెందిన రఘుబాబు , ఆకాన్ష్ గా గుర్తించారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.