జుక్కల్
మంచినీటి ట్యాంకులను శుభ్రంచేయించిన సెక్రటరీ
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలోని మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకులను గ్రామపంచాయతీ సెక్రటరీ భాస్కర్ గ్రామపంచాయతీ సిబ్బందిచే మంగళవారం బ్లీచింగ్ పౌడర్ తో క్లీనింగ్ చేయించారు. ఈ సందర్భంగా సెక్రటరీ భాస్కర్ మాట్లాడుతూ.. వర్ష కాలం దృష్ట గ్రామ ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మంచినీటి ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ తో గ్రామపంచాయతీ సిబ్బందిచే శుభ్రం చేయించడం జరిగిందని తెలిపారు.