ఎస్బీఐలో 1497 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. 1497 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 14 నుండి ప్రారంభం కాగా, చివరి తేదీ అక్టోబర్ 4 గా నిర్ణయించింది. దరఖాస్తుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రతి పోస్టుకు అవసరమైన విద్యార్హతలు, వయోపరిమితి వివరాల గురించి ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ https://sbi.co.in/ ను సదర్శించి తెలుసుకోవచ్చు.