ఆ కవిత నాలో స్ఫూర్తినింపుతుంది: సమంత ఆసక్తికర పోస్ట్
హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. తాజాగా సమంత తనకు ఇష్టమైన కవితను నెట్టింట షేర్ చేశారు. “విజయాలన్నింటినీ పక్కనపెట్టి ఒక్కసారి రిస్క్ చేసినప్పుడు.. అక్కడ ఓడిపోతే మళ్లీ కొత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టాలి. అంతేగానీ, ఆ ఓటమి గురించే ఆలోచిస్తూ కూర్చోకూడదు” అనే అర్థం వచ్చేలా సమంత షేర్ చేసిన కవితలో ఉంది. ఈ కవిత తనలో ఎప్పుడూ స్ఫూర్తినింపుతుందని సమంత పేర్కొన్నారు.