జైలు నుంచి విడుదలైన కవిత
లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ రావడంతో ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి BRS ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. ఈ కేసులో మార్చి 15న ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది. బెయిల్ కోసం కవిత పలుమార్లు పిటిషన్లు వేసినా, ఈడీ అభ్యర్ధన మేరకు రిమాండ్ పొడిగిస్తూ వచ్చింది. సీబీఐ కూడా ఆమెను విచారించింది. 166 రోజుల తర్వాత కవితకు బెయిల్ వచ్చింది.