గణేశ్ నవరాత్రి వేడుకల్లో 78 ఏళ్ల బామ్మ డ్యాన్స్ అదుర్స్.. వీడియో వైరల్
గణేశ్ ఉత్సవాల్లో 78 ఏళ్ల ఓ బామ్మ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. హైదరాబాద్‌లో టిక్ టాక్ బామ్మగా పిలుచుకునే విజయలక్ష్మి ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటోంది. తాజాగా ఆమె వినాయకుడి మండపం వద్ద స్టెప్పులు వేసింది. బామ్మ డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా, ఇదివరకు టిక్‌టాక్‌లో డ్యాన్స్ వీడియోలు, రీల్స్ ద్వారా దాదాపు 70-80 వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం, ఇన్‌స్టాలో ఆమెను దాదాపు 22 వేల మంది ఫాలో అవుతున్నారు.