దేవరకొండ నియోజకవర్గం
దేవరకొండ: సీపీఐ బహిరంగసభను జయప్రదం చేయండి
సీపీఐ వందేళ్ళ ఉత్సవాల సందర్భంగా ఈనెల 30న నల్గొండలో నిర్వహించే బహిరంగసభను జయప్రదం చేయాలని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రామవత్ అంజయ్య నాయక్ అన్నారు. బుధవారం రేగళ్లతండాలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వందేళ్ల సీపీఐ ప్రస్థానంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి విజయం సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి రామస్వామి, మోతిలాల్, వెంకట్రాం, తదితరులు పాల్గొన్నారు.