ఖమ్మం
ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
అన్ని దానాల కన్నా. రక్తదానం గొప్పదని, యువత ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆదుకోవాలని ప్రముఖ వైద్యుడు కూరపాటి ప్రదీప్ కుమార్ అన్నారు. దేవర చిత్రం విడుదల సంధర్బంగా తలసేమియా చిన్నారుల సహాయార్ధం ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం నగరంలోని తిరుమల థియేటర్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పలువురు యువత రక్తదానం చేశారు. తలసేమియా చికిత్సలకు ఈ రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.