వికారాబాద్
మహమ్మదాబాద్: బియ్యం పట్టివేత
అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్న ఘటన మహమ్మదాబాద్ పీఎస్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం సివిల్ సప్లై డిటి ఆదిత్య గౌడ్ ఫిర్యాదు మేరకు అన్నా రెడ్డిపల్లి శివారులో గోపాల్ నాయక్ ఇంట్లో అక్రమంగా పిడిఎస్ బియ్యం నిల్వ ఉంచడంతో రైడ్ చేయగా దాదాపు 35 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని, గోపాల్ నాయక్, సంగమేశ్వర్, కాశన్నలపై కేసు నమోదయినట్టు ఎస్సై తెలిపారు.