
గన్నవరం: గంజాయి విక్రయాలను అరికట్టాలి
గన్నవరంలో విచ్చలవిడిగా జరుగుతున్న గంజాయి విక్రయాలను నియంత్రించేందుకు పోలీస్ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తుందన్నారు. జల్సాలకు అలవాటు పడిన యువకులు గంజాయిని తీసుకువచ్చి విక్రయించడం, తాగడం చేస్తున్నారన్నారు.