కోల్‌కతా కేసులో కీలక పరిణామం.. మాజీ ప్రిన్సిపల్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచార ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్‌ను పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. కాగా, ఈ కేసులో సీబీఐ అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసులో సంజయ్రాయ్ ప్రధాన నిందితుడని హత్య జరిగిన మరుసటి రోజే స్పష్టమైందని తెలిపారు.