రాజాం
రఘురామకృష్ణంరాజు దళితుల పై అరాచకం
కుల అహంకారంతో ఉన్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తక్షణమే అరెస్ట్ చేయాలని రాజాం దళిత సంఘాల జేఏసీ నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈమేరకు డాక్టర్. బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీ ని చించిన ఎమ్మెల్యే ను అరెస్ట్ చేయాలని రేగిడి ఆమదాలవలస ఎస్ఐ లీలావతికు వినతి పత్రం అందజేశారు. కూటమి నాయకులు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అంబేద్కర్ పెట్టిన భిక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో బొత్స బుద్ధుడు, తేగల మోహన్, శ్రీను పాల్గొన్నారు.