
సొంత నిధులతో బోరు వేయించిన బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ (BVK)
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాల్టిలో నీటి కొరతను తెలుసుకొని, ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాంగ్రెస్ నేత బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ పూనుకున్నారు. తన సొంత భూమిలో సొంత నిధులతో బోరు వేయించి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపాల్టికి అప్పగించారు. విప్లవ్ పెద్ద మనస్సుకు అంతా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నరసింహా రెడ్డి, డీఈఈ రాములు, మాజీ ఉప సర్పంచ్ గోవిందరాజు, సంతోష్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.