థియేటర్ ముందు మేకపోతును బలిచ్చిన ఎన్టీఆర్ అభిమానులు.. వీడియో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా థియేటర్లలో విడుదలైంది. అభిమానులు థియేటర్ల ముందు చేస్తున్న హంగామా మామూలుగా లేదు. థియేటర్ల ముందు కటౌట్లకు పాలాభిషేకాలు చేయడమే కాకుండా మరికొందరు మద్యం రక్తంతో కూడా అభిషేకం చేస్తున్నారు. ఓ థియేటర్ ముందు ఏకంగా మేకపోతును బలి ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కొందరు ఇలా మూగజీవాలను బలి చేయడం భావ్యం కాదంటూ మండిపడుతున్నారు.